కార్తీకమాసంలో కార్తీక స్నానాలకు అ్యతంత ప్రాముఖ్యత ఉంది. మహిళలు ఈ నెలంతా ప్రతి రోజూ కార్తీక స్నానాలు చేస్తారు.. ముఖ్యంగా చవితి, పాడ్యమి, పొర్ణమి, ఏకాదశి, చతుర్దశి,ద్వాదశి తిథుల్లో దగ్గరల్లోని పుణ్యక్షేత్రాలకు వెళ్లి కార్తీక స్నానాలు ఆచరించి.. దీపాలు వెలిగిస్తారు. పరమశివుడికి అభిషేకాలు, పూజలు చేసి ఉపవాసం ఉంటారు. ఇలా కార్తీక మాసంలో చేసే స్నానం, దానం,జపం వంటి వాటి వల్ల ఎన్నో జన్మల పుణ్య ఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.. అయితే కార్తీక మాసంలో అందరికి అన్ని రోజులు స్నానాలు, ఉపవాసాలు చేయడం కుదరదు..అలాంటివారు కార్తీక మాసం పర్వదినాలైన సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి రోజులలో స్నానాలు చేసి, ఉపవాసం ఉండి,గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభించే జన్మజన్మల పుణ్యఫలం వస్తుందని సాక్షాత్తు బ్రహ్మదేవుడు చెప్పాడు. కావున కార్తీకమాసంలో ప్రతి రోజు తెల్లవారుజామున స్నానాలు చేయడం కుదరడం లేదని..బాధపడకండి..కనీసం ఈ మాసంలో వచ్చే సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిధుల రోజులలో తెల్లవారుజామునే కార్తీక స్నానాలు ఆచరించండి..అనంతమైన పుణ్యఫలాన్ని పొందండి.