టాలీవుడ్ రియాలిటీ షో బిగ్ బాస్ నిన్న ఆదివారం నాడు ఘనంగా ముగింపు వేడుకలు జరిగాయి. 100రోజుల పాటు ప్రేక్షకులను అలరించినా ఈ షో అంతగా రాణించలేదనే చెప్పాలి. గత మూడు సీజన్లతో పోల్చుకుంటే ఈ షో చాలా తక్కువనే చెప్పాలి. ఇంక ఈ విషయం పక్కన పెడితే విన్నర్ విషయంలో మాత్రం బిగ్ బాస్ న్యాయం చెయ్యలేదని కొందరు వాదిస్తున్నారు. సీజన్ 3 విన్నర్ గా హోస్ట్ నాగార్జున రాహుల్ సిప్లిగంజ్ను విజేతగా ప్రకటించారు. అసలు రాహుల్ ని విజేతగా ఎలా ప్రకటించారో చెప్పాలని డిమాండ్ చేసారు. షో లో ఒక్కసారి కూడా కెప్టెన్ గా ఎన్నికకాని రాహుల్ ని ఎలా ప్రకటిస్తారని వాదనకు దిగారు.