తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు అబ్దుల్ మెట్ పూర్ తహసీల్దార్ విజయారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ దాడికి పాల్పడి.. సజీవ దహానానికి పాల్పడిన సంగతి విదితమే. ఇప్పటికే ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఖండించారు. ప్రజలకు ఏమన్న సమస్య ఉంటే ప్రభుత్వానికి తెలియజేయాలని . అంతే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. అయితే విజయారెడ్డి హత్యపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.హయత్ నగర్ మండలం గౌరెల్లి గ్రామానికి చెందిన సురేష్ అనే నిందితుడు కొన్ని రోజులుగా వ్యవసాయ భూమి పట్టాలో మార్పులు కోసం తహసీల్దార్ ను పలు సార్లు కలిశాడు. ఎంతకూ ఈ సమస్యకు పరిష్కారం చూపించకపోవడంతో సురేష్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
