రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ దారుణ హత్యకు గురయ్యారు. తహసీల్దార్ కార్యాలయంలోనే తహసీల్దార్ విజయరెడ్డిపై దుండగుడు పెట్రోలు పోసి నిప్పింటించాడు. తహసీల్దార్‌ను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భోజన విరామ సమయంలో జనం తక్కువ ఉన్నప్పుడు దుండగుడు దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుడు ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు.
