సూపర్ స్టార్ మహేష్, నమ్రతా గురించి తెలియనివారు ఉండరు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మహేష్ సినిమాల్లో బిజీగా ఉంటే మరోపక్క భార్య నమ్రతా బిజినెస్ పరంగా చూసుకుంటుంది. అంతేకాకుండా ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్యామిలీ కి సంబంధించి అన్ని షేర్ చేసుకుంటుంది. తన పిల్లల విషయంలో ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది. అయితే తాజాగా కొడుకు గౌతమ్ పిక్ ఒక పోస్ట్ చేసింది. ఆ పిక్ లో గౌతమ్ ఒక మొమెంటో పట్టుకొని ఉంటాడు. గౌతమ మోడల్ యునైటెడ్ నేషన్స్ సెషన్ లో బెస్ట్ డేలిగేట్ అవార్డు సాధించాడు. ఈ అవార్డును నమ్రతా అందరితో పంచుకున్నారు.