జనసేన అధినేత ,ప్రముఖ హీరో పవన్ కళ్యాన్ తన అభిమానులకు,పార్టీ నేతలకు,అభిమానులకు ఒక పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాన్ మాట్లాడుతూ” గత కొంతకాలంగా రాష్ట్రంలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారంలో వైసీపీ ప్రభుత్వం విఫలమయింది. వైసీపీ ప్రభుత్వానికి వారం రోజులు సమయం ఇస్తున్నాము. ఈవారం రోజుల్లో ఇసుక కొరత సమస్యను తీర్చకపోతే జనసేన పార్టీ అభిమానులు,నేతలు ,కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడే టెంట్లు వేసి కూర్చోవాలని “పిలుపునిచ్చారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలు తీరేవరకు పోరాడాలి. వారికి అండగా నిలబడాలని పవన్ కళ్యాన్ పిలుపునిచ్చారు.
