నర్సీపట్నం టీడీపీ నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సిపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. టీడీపీ కి చెందిన మాజీ చైర్పర్సన్ చింతకాయల అనిత, వైస్ చైర్ పర్సన్ సన్యాసి పాత్రుడు పలువురు కౌన్సిలర్లతో సహా రాజధాని అమరావతిలో సోమవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. మాజీ మంత్రి అయిన అయ్యన్నపాత్రుడి నియోజకవర్గం కావడం దానిలో అతని యొక్క సోదరుడైన సన్యాసి పాత్రుడు వైయస్ఆర్సిపీలో చేరడం చర్చనీయాంశ మారింది. దీనిబట్టి తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో బలహీన పడుతుందని అర్థమవుతుంది. కొన్ని నెలలలో మున్సిపల్ ఎలక్షన్లు జరగాల్సింది.. ఈ తరుణంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలను నాయకులను కోల్పోవడం టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. జగన్ పరిపాలన క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రయోజనాలు కల్పిస్తుందని ప్రజల నమ్మకాన్ని మనసులను గెలుచుకోగలిగిందని స్పష్టమవుతుంది.