దేశీయ మార్కెట్లు వారం ప్రారంభ దశలో మొదటి రోజు అయిన సోమవారం లాభాలతో ముగిశాయి. ఈ రోజు సాయంత్రం వరకు మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 136.94 పాయింట్లు లాభపడి 40301.96 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 54.60 పాయింట్లు లాభపడి 11945.20 వద్ద ముగిసింది. ఈరోజు సోమవారం టాటా స్టీల్స్,వేదాంత,ఏఎన్జీఎస్ షేర్లు లాభపడ్డాయి. ఎస్ బ్యాంకు,మహీంద్రా అండ్ మహీంద్రా ,టీసీఎస్, అండర్ టాటా మోటర్స్ షేర్లు నష్టపోయాయి.
