తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ సపోర్టుతో విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి వాటికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ మీటింగ్ కు వస్తే 250 రూపాయలు ఇస్తామని చెప్పి జనసేన నాయకులు మోసం చేశారంటూ పలువురు మహిళలు వాపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికుల నుంచి స్పందన లేకపోవడంతో జనసేన కార్యకర్తలు జన సమీకరణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో చుట్టుపక్కల గ్రామాలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలను తీసుకువచ్చి అనేక ఇబ్బందులకు గురి చేశారని కనీసం డబ్బులు కూడా ఇవ్వలేదు అంటూ వారు ఆగ్రహం వెలిబుచ్చారు.