తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ తహిసీల్దార్ విజయారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి సజీవ దహానం చేసిన సంగతి విదితమే. ఇప్పుడు ఇది నగరంలో సంచలనం సృష్టిస్తుంది.
ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఈ ఘటనపై మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ” అబ్దుల్లాపూర్ ఘటనపై తీవ్రంగా ఖండించారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పొలీసులను ఆదేశించారు. ప్రజలకు ఏమన్న సమస్యలుంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి. కానీ ఇలాంటి చర్యలకు పాల్పడోద్దంటూ ఆమె అన్నారు