ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం లో టీమిండియా పై బంగ్లాదేశ్ 7వికెట్ల తేడాతో గెలిచింది. మొదటి టీ20 లో ఇండియా ఓడిపోవడానికి ముఖ్య కారణం జట్టు చేసిన చిన్న చిన్న తప్పులే. ముఖ్యంగా చెప్పాలంటే డీఆర్ఎస్ విషయంలో పూర్తిగా విఫలమైంది భారత్. ముష్ఫికర్ రహీమ్ స్టంప్స్ ముందు దొరికిన తరువాత భారత ఆటగాళ్ళు డీఆర్ఎస్ తీసుకోకపోగా, ఇండియా క్యాచ్-బ్యాక్ అప్పీల్ కోసం వృధా చేసింది. రిషబ్ పంత్ పట్టుబట్టిన తరువాత, కెప్టెన్ రోహిత్ శర్మ డీఆర్ఎస్ ను తీసుకున్నాడు. కాని రీప్లేలో అల్ట్రా ఎడ్జ్‌లో ఎటువంటి స్పైక్ చూపించలేదు. ఇలా ప్రతీ విషయంలో భారత్ తప్పు చేసుకుంటూ వచ్చింది. దేనిపై మండిపడుతున్న అభిమానులు ధోని లేకపోవడం ఎంత నష్టమో ఇప్పుడైనా అర్ధమైందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.