జూలై 21న మొదలైన తెలుగు బిగ్ రీయాలీటి షో బిగ్‌బాస్ 3 నవంబర్ 3న ముగిసింది. పదిహేను మంది కంటెస్టెంట్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఎవ్వరూ ఊహించని రీ ఎంట్రీ, ఈ మూడో సీజన్‌కు హైలెట్‌గా నిలిచాయి. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మొదలైన ఈ ఫినాలే ఎపిసోడ్‌లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఎంతో మంది వెండితెర తారలు, బుల్లితెర నటీనటులు తమ ఆటపాటలతో అలరించారు. చివరగ బిగ్‌బాస్ టైటిల్ విజేత ఎవరన్న ఉత్కంఠకు తెరదించుతూ.. విన్నర్‌ను ప్రకటించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇచ్చాడు. టాప్5లోంచి అలీ, వరుణ్, బాబా ఎలిమినేట్ కాగా.. మిగిలిన ఇద్దరి భవిష్యత్తును తేల్చేందుకు చిరు వచ్చేశాడు. ఫినాలె ఎపిసోడ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చిరు.. విజేతను ప్రకటించేందుకు బిగ్‌బాస్ స్టేజ్ మీదకు వచ్చేశారు. టీఆర్పీలో ప్రపంచంలోనే నెంబర్ వన్ షో అని.. ఫినాలే ఎపిసోడ్‌కు తనను పిలిచినందుకు చిరంజీవి ధన్యవాదాలను తెలిపారు. రాగానే నాగ్‌ను ఇరకాటంలోకి నెట్టాడు. ఉన్న ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చెప్పమని నాగ్‌ను ప్రశ్నించాడు. కోపం కూకట్ పల్లిలో ఉండే నాగార్జున నార్కట్ పల్లిలో ఉంటాడంటూ నాగ్‌పై అదరిపోయే పంచ్ వేశాడు. ఖాన్ కే నీచే అంటూ నాగ్ కోప్పడిన సంఘటనను తన స్టైల్లో పంచ్ లు వేశాడు మెగాస్టార్ .
