40 ఏళ్ళు రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు జగన్ దెబ్బకు చక్కేరులు కొడుతున్నారు. వేసిన ప్రతీ ప్లాన్ బెడిసికొడుతుంది. రంగంలోకి హేమాహేమీలను దింపినా సరే పనికావడం లేదు. చివరికి తన దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ ని పంపినప్పటికీ పని కాలేదు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి. “పాపం చంద్రబాబు కష్టాలు పగోడికి కూడా రావొద్దు. పేమెంటు తనే ఇవ్వాలి. పచ్చ మీడియా కవరేజి బాధ్యత చూసుకోవాలి. కార్యకర్తలను తనే తరలించాలి. ప్రజలకు ఇద్దరి అనుబంధం తెలిసిన తర్వాత కూడా ఏదో ఒక హడావుడి చేయాలి కాబట్టి దత్తపుత్రుడిని ముందుకు నెట్టాడు. లాంగ్ మార్చ్ కాస్త తుస్సుమంది”. అని అన్నారు.