Home / ANDHRAPRADESH / విశాఖ జిల్లాలో చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ.. వైసీపీలో చేరుతున్న కీలక టీడీపీ నేత..!

విశాఖ జిల్లాలో చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ.. వైసీపీలో చేరుతున్న కీలక టీడీపీ నేత..!

ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సీఎం జగన్ పాలనకు ప్రజల్లో సానుకూలత ఏర్పడడం, బాబుకు వయసైపోవడం, లోకేష్‌కు నాయకత్వ లక్షణాలు లేకపోవడంతో వచ్చేసారి అధికారంలోకి వస్తామో రామో అన్న ఆందోళనతో టీడీపీ కీలక నేతలంతా.. తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీకి గుడ్‌బై చెప్పేసి వైసీపీలో చేరుతున్నారు. ఇప్పటికే విశాఖ జిల్లాలో టీడీపీ నాయకులంతా వరుసగా వైసీపీ గూటికి చేరుకుంటున్నారు. విశాఖ డెయిరీ ముఖ్య కార్యనిర్వహణాధికారి అడారి ఆనంద్‌కుమార్, యలమంచిలి మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్, విశాఖ డెయిరీ డైరెక్టర్ పిల్లా రమాకుమారి తదితరులు టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు.తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి సోదరుడు సన్యాసిపాత్రుడు..ఈ రోజు వైసీపీలో చేరనున్నాను. తన సోదరుడు అయ్యన్నపాత్రుడి పుట్టినరోజు సందర్భంగా రాజీనామా చేసి, అటు పార్టీకి, ఇటు సోదరుడికి షాక్ ఇచ్చిన సన్యాసిపాత్రుడు ఈ రోజు వైసీపీలో చేరేందుకు తన కుటుంబసభ్యులు, అనుచరులు, ముఖ్య టీడీపీ నేతలతో కలిసి తాడేపల్లికి వెళ్లినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఇద్దరు సోదరుల మధ‌్య కొనసాగుతున్న వైరమే సన్యాసిపాత్రుడిని వైసీపీ దిశగా అడుగులు వేయిచింది. ముఖ్యంగా సన్యాసిపాత్రుడికి నర్సీపట్నం మున్సిపాలిటీలో మంచి పట్టు ఉంది. దీంతో ఆయన్ని పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇవాళ సన్యాసిపాత్రుడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఎన్నికలకు ముందే సన్యాసీ పాత్రుడు వైసీపీలో చేరేందుకు సిద్ధమైనా..ఎందుకనో వర్కవుట్ కాలేదు. కాగా తన సోదరుడి అయ్యన్నపాత్రుడి ఘోరపరాజయంలో సన్యాసిపాత్రుడు కీలక పాత్ర పోషించాడని తెలుస్తోంది. ఆ ఎన్నికల్లో పరోక్షంగా వైసీపీ అభ్యర్థి ఉమాశంకర్‌కు సన్యాసిపాత్రుడు సహకరించినట్లు సమాచారం. ఎట్టకేలకు అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసిపాత్రుడు వైసీపీ తీర్థం పుచ్చుకోవడం స్థానిక ఎన్నికలకు ముందు టీడీపీకి పెద్ద షాకే..ఇక విశాఖ జిల్లాలో మాజీ మంత్రి గంటాతోపాటు, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌లు కూడా త్వరలో టీడీపీకి గుడ్‌బై చెప్పి, వైసీపీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు సన్యాసిపాత్రుడు వంటి కీలక నేత కూడా వైసీపీ గూటికి చేరుకోవడంతో విశాఖ జిల్లాలో టీడీపీ భూస్థాపితం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మొత్తంగా సన్యాసిపాత్రుడు వైసీపీలో చేరడం చంద్రబాబుకు ఎదురుదెబ్బే అని చెప్పకతప్పదు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat