ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చున్నప్పుడు వెనుక తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి నిలబడిన ఓ ఫోటో ప్రస్తుతం సచివాలయంలో ఆకట్టుకుంటోందట. సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన చాంబర్లో ఓ పెద్ద ఫ్రేమ్లో జగన్ ఫోటోలు తయారు చేయించారట. ఉన్నతాధికారులు సదరు మంత్రులు ఈ ఫోటో గురించి చర్చించడం మొదలు పెట్టాక ఈ ఫోటో ఎలా ఉంటుందా అని చూడ్డానికి అందరు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చాంబర్ ఛాంబర్ కి వెళ్తున్నారట.. అనిల్ కుమార్ యాదవ్ ఈ ఫోటోను ఆయన ఛాంబర్ కి వచ్చినవారికి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
