తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రస్తుతం యూరప్ లో పర్యటిస్తున్న సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నెదర్లాండ్ లో సీడ్ వ్యాలీ పొలండ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ” యూరోపియన్ దేశాలకు విత్తన ఎగుమతుల విషయంలో ప్రోత్సాహాం ఇస్తామన్నారు.
సీఎం కేసీఆర్ మాగదర్శకంలో తెలంగాణ రాష్ట్రం సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఎదిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో కరీంనగర్,వరంగల్,ఖమ్మం,పాలమూరు జిల్లాల్లో కూరగాయమ విత్తనోత్పత్తికి మంచి అవకాశాలున్నాయి. ప్రస్తుతం 4 లక్షల కోట్ల విలువ గల అంతర్జాతీయ సీడ్ మార్కెట్ మరో ఆరేళ్ల నాటికి ఆరు లక్షల కోట్ల వరకు ఉంటుందని అన్నారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ లో కూరగాయల విత్తనోత్పత్తికి మంచి అవకాశాలున్నాయని మంత్రి తెలిపారు.
ప్రస్తుతం 4 లక్షల కోట్ల విలువ గల అంతర్జాతీయ విత్తన మార్కెట్ 2025 నాటికి 6లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఇంటర్నేషనల్ సీడ్ లా,నియమనిబంధనలు,ప్రమాణాలకు భారత్ సీడ్ లాకు ఉన్న తేడాల వలన సీడోత్పత్తి,సీడ్ టెస్టింగ్స్ లలో చాలా తేడా ఉండటంతో ఇంటర్నేషనల్ సీడ్ వ్యాపారంలో ఇండియా వాటా శాతం 2 కన్నా తక్కువగా భాగస్వామ్యముందని తెలిపారు.తెలంగాణలో నైపూణ్యమైన రైతులు.. అనుకూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో ఇప్పటికే నాలుగు వందల జాతీయ ,అంతర్జాతీయ స్థాయి సీడ్ కంపెనీలు ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేశాయని ఆయన తెలిపారు.