ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డునపడ్డారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ నవంబర్ 3న వైజాగ్‌లో రోడ్డెక్కి కేవలం రెండున్నర కిలోమీటర్ల మేర లాంగ్‌మార్చ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ లాంగ్‌మార్చ్‌కు మిగిలిన ప్రతిపక్ష పార్టీలేవి హాజరు కాలేదు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఈ లాంగ్‌మార్చ్‌కు మద్దతు పలికేశారు. అంతే కాదు పవన్ లాంగ్‌మార్చ్‌ను భారీగా కవర్ చేయాలని జాతీయమీడియా ఛానళ్లకు దీపావళికి ముందు ఇచ్చిన పార్టీలో బాబు రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం. అయితే ఇవాళ పవన్ లాంగ్‌మార్చ్‌లో జనసైనికుల కంటే..తెలుగు తమ్ముళ్లే ఎక్కువగా పాల్గొనబోతున్నారు. ఇసుక కవాతు చేసిన జనసేనాని అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ మీడియాముఖంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో స్టార్ హీరో అయిన పవన్ కల్యాణ్ నటించేటప్పుడు అనేక ప్రొడక్షన్‌లు, బ్యానర్లలో సిన్మాలు చేసి ఉంటారు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ ఒకే ఒక బ్యానర్‌లో పని చేస్తున్నారు..అదే నారావారి ప్రొడక్షన్ అని అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో గత ఐదేళ్ల నుంచి ఇప్పటిదాకా పవన్ నారావారి బ్యానర్ నుంచే రెమ్యూనరేషన్లు అందుతున్నాయని..పవర్ స్టార్ నుంచి ప్యాకేజీ స్టార్‌గా మారిపోయారని అమర్‌నాథ్ సెటైర్ వేశారు. అసలు పవన్ సినిమాలు ఎందుకు మానేశారో మొదట్లో ఎవరికీ అర‌్థం కాలేదు.. ఆయన కాల్షీట్ల కోసం ఇప్పటికీ మెగా ప్రొడ్యూసర్లు తిరుగుతున్నారని..అయినా సిన్మాలను వదులుకున్నారంటే ఇక్కడ బడా ప్రొడ్యూసర్ చంద్రబాబు ఇచ్చే కాల్షీట్లు, రెమ్యూనరేషన్లు ఎక్కువ కాబట్టే.. అని అమర్‌నాథ్ చురకలు అంటించారు. వైయస్ జగన్ ఏపీకి ముఖ్యమంత్రి అయితే నా పేరు పవన్ కల్యాణ్ కాదు అని జనసేనాని సవాలు చేశాడని ఆయన గుర్తు చేశారు. మరి ఇప్పుడు పవన్ కల్యాణ్ తన కొత్త పేరు ఏమని చెబుతాడు..? రెండు లక్షల పుస్తకాలు చదవివానని చెప్పుకునే పవన్ తన పుస్తకాల్లోంచి మంచి పేరు ఎప్పుడు పెట్టుకుంటారు.. నారా పవన్ కల్యాణ్ అని పేరుమార్చుకుంటారా అంటూ అమర్‌నాథ్ ప్రశ్నించారు. అమర్‌నాథ్ కౌంటర్లపై నెట్‌జన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు,. చంద్రముఖి సిన్మాలో రజనీకాంత్ ప్రభుతో చెబుతాడు..చూడు చంద్రముఖిలా మారిన గంగ..అని..అలాగే చూడు నారాపవన్ కల్యాణ్‌లా మారిన కొణిదెల పవన్ కల్యాణ్ అని నెట్‌జన్లు ఫుల్లుగా సెటైర్లు వేస్తున్నారు. మొత్తంగా జనసేనానిపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ వేసిన సెటైర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల‌్‌గా మారాయి.
