గత ఐదేళ చంద్రబాబు హయాంలో అంటూ ప్రతి ఏటా ఆ సమ్మిట్, ఈ సమ్మిట్ అంటూ వేల ఎంవోయూలు చేసుకుని లక్షల కోట్ల పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు ఏపీకి తరలివస్తున్నాయి, లక్షలాది ఉద్యోగాలు రాబోతున్నాయని ఎల్లో మీడియా ఛానళ్లు, పత్రికలు ఊదరగొట్టాయి. చంద్రబాబు, లోకేష్‌లు కొంతమంది టీడీపీ ఎన్నారైలు, లేదా..టీడీపీ అభిమానులైన చిన్న చిన్న వ్యాపారులకు సూటు, బూటు వేసి వారి చేతికో పత్రం ఇచ్చి ఎంవోయూలు చేసుకున్నాం…ఇక పెట్టుబడులు ఉద్యోగాలే అంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చేవారు. ప్రతి ఏడాది ఇదే తంతు..ఆఖరికి విదేశాలకు ప్రజల డబ్బులు తగలేసి మరీ..అక్కడ ఎన్నారైలకు లంచ్‌లు, డిన్నర్‌లు ఇచ్చి మరీ..ఎంవోయూలు అంటూ..బాబుగారు బిల్డప్ ఇచ్చేవారు. ఆఖరికి జీడిపప్పు అమ్ముకునే టీడీపీ కార్యకర్తకు కూడా సూటు, బూటు వేసి ఎంవోయూ పత్రం చేతిలో పెట్టిన ఘనులు చంద్రబాబు. రియాలిటికీ వస్తే..సరిగ్గా ఒక్క పెద్ద పరిశ్రమ వచ్చింది లేదు..పట్టుమని పది ఉద్యోగాలు యువతకు ఇచ్చింది లేదు..అమరావతి, విశాఖలో దిగినవన్నీ బాబు, లోకేష్‌ల సూట్‌కేస్ కంపెనీలే..అయితే ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ గత ఐదేళ్లలో జరిగిన అవకతవకలను, అవినీతిని సరిదిద్దుతూనే, దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగేలా..ఏపీ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా పెట్టుబడులకు, కొత్త పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తోంది. త్వరలో జపాన్‌కు చెందిన ఏటీజీ సంస్థ 1,600 కోట్ల పెట్టుబడితో కొత్తగా టైర్ల తయారీ కంపెనీని విశాఖలో ప్రారంభించబోతుంది ఈ 2,000 మందికి ప్రత్యక్షంగా, 3,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. అలాగే చైనాకు చెందిన వింగ్‌టెక్ సంస్థ మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్ 1000 కోట్లతో రేణిగుంటలో పెడుతుంది. ఈ యూనిట్ ద్వారా నేరుగా 10,000 మందికి ఉపాధి లభించడంతో పాటు మరో 5,000 మందికి సప్లైచైన్ విభాగంలో పరోక్ష ఉపాధి లభించనుంది. ఇక హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్ సెజ్ డెవలప్‌మెంట్ సంస్థ 750 కోట్ల పెట్టుబడితో శ్రీకాళహస్తిలో భారీ స్థాయిలో పాదరక్షల తయారీ యూనిట్‌ను ఏపీలో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. దీని వలన ప్రత్యక్షంగా 22,000 మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి.
అయితే మొత్తం 3 వేల కోట్ల పెట్టుబడులతో కొత్త పరిశ్రమల వస్తుంటే ఓర్వలేక కమ్మని కుట్రకు తెరలేపిన పచ్చపత్రికలు విషం చిమ్ముతున్నాయి. తమ మీడియా గ్రూపులో 2600 కోట్లు పెట్టుబడులు పెట్టిన రిలయన్స్ వెనక్కి వెళ్ళిపోతుందని బాబుగారి కులగురువు పత్రిక తప్పుడు కథనాలు రాసింది. ఇక ఫ్రాంక్లిన్ టెంపుల్ట్రన్ వెనక్కి వెళ్ళిపోతుంది అని బాబుగారి జ్యోతి ఆరిపోకుండా ఆరాటపడే ఇంకో పత్రిక రాసింది. ఈ ఫ్రాంక్లిన్ టెంపుల్ట్రన్ అనే కంపెనీ కి నారా లోకేష్ అడిగిన దానికంటే ఎక్కువ భూమి ఇచ్చి భారీగా కమీషన్లు దోచుకున్నాడని భోగట్టా. ఈ రెండు కంపెనీలకు టీడీపీతో మంచి అనుబంధం ఉంది. ఏపీకి కొత్త పరిశ్రమలు వస్తుంటే జగన్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని కుళ్ళుతో ఆ వార్తలు కనపడకుండా పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని పచ్చపత్రికలు విషం చిమ్ముతున్నాయి. ఇక బాబు హయాంలో పలాసలో జీడిపప్పు అమ్ముకొనే వ్యక్తికీ సూటు బూటు వేసి అతను ఒక వెయ్యి కోట్లతో పరిశ్రమ పెడుతున్నాడు అని విశాఖ సమ్మిట్‌లో ఎంవోయూ కుదుర్చుకున్నాడు. అలాగే నరసారావుపేట్‌లో ఇంజనీరింగ్ కాలేజీల్లో స్టూడెంట్స్‌ను చేర్చి కమీషన్ లు తీసుకొనే వ్యక్తికీ కూడా వ్యక్తికీ సూటు బూటు వేసి అతను ఒక వెయ్యి కోట్లతో పరిశ్రమ పెడుతున్నాడని విశాఖ సమ్మిట్‌లో బాబు ఎంవోయూ పత్రం అతని చేతిలో పెట్టాడు. అసలు బాబుగారి హయాంలో అన్నీ ఇలాంటి ఇలాంటి ఉప్మా బ్యాచ్‌తో చేసుకున్న ఒప్పందాలే.
ఇక పెట్టుబడుల పేరుతొ ప్రతి 3 నెలలకు ఒకసారి బాబు విదేశాలకు వెళ్ళాడు.. కానీ వచ్చింది ఒక కియా మాత్రమే, అది కూడా మోడీ సిఫారసుతో. అయితే అనంతపురం జిల్లా పెనుగొండలో కియా పెడుతున్నాను అని బాబు ముందే తన వాళ్లకు చెప్పడంతో అక్కడ నాటి మంత్రి పరిటాల సునీత చౌదరి , టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ చౌదరి, టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి చౌదరి ఒక వెయ్యి ఎకరాలు రైతుల దగ్గర డెడ్‌చీప్‌గా కొని లాభపడ్డారు. అయినా బాబుగారికి, ఎల్లోమీడియా సిగ్గా..ఎగ్గా..పాపం బాబు కాలిలో ముళ్ళు గుచ్చుకొంటే పచ్చ మీడియాధిపతుల కండ్లలో కన్నీరు వస్తుంది. ఆఖరికి ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు రాస్తే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం జీవో జారీ చేసినా..పచ్చ కలాలు రెచ్చిపోతునే ఉన్నాయి. అందుకే ముగ్గరు పచ్చమీడియాధిపతులపై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. మీడియా అధిపతులు కారు , కులాధిపతులు వారు..కలానికి సంకెళ్లు అని కాదు, కులానికి సంకెళ్లు అన్నదే వాళ్ల బాధ..బాబును అడ్డం పెట్టుకొని తాము పాలించాలని ఆ పచ్చమీడియాధిపతులు కలలు కంటున్నారు. మా కులమే ఎల్లకాలం పరిపాలించాలి మా కులస్థుడు బాబే శాశ్వత సీఎంగా ఉండాలి.. .మేమే దోచుకోవాలి అనుకొనే కులానికి సంకెళ్లే కానీ కలానికి కాదని మంత్రి కొడాలి మండిపడ్డారు. ఇక పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ..పచ్చమీడియాకు కుల పిచ్చి , మా బాబే సీఎం గా ఉండాలి అని పచ్చ పాతంగా రాస్తున్నాయని అంటూ ఎండగట్టారు. వాసవి లాంటి కో ఆపరేటివ్ బ్యాంకులు మూతపడితే నా చిట్ ఫండ్స్ లాభపడుద్ది అని బాబుగారి కులగురువు ఉన్నవి లేనిపోనివి రాసి మూయించాడని నవంబర్ 1 న సాక్షి టీవీ చర్చలో బీజేపీ నేత రఘునాధ బాబు తీవ్రంగా ఆక్షేపించారు. మొత్తంగా ఏపీలో జగన్ సర్కార్ హయాంలో కొత్త పరిశ్రమలు వస్తుంటే..కమ్మని కుట్రకు తెరలేపిన పచ్చపత్రికలు పరిశ్రమలు వెనక్కిపోతున్నాయని పచ్చకథనాలతో విషం చిమ్ముతూనే ఉన్నాయి. ఆధారాలు లేకుండా ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారాలు చేసే ఈ పచ్చమీడియాకు కళ్లెం వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పాలి.