వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. లాంగ్ మార్చ్ పేరుతో ఈరోజు పవన్ చేసిన కార్యక్రమం చూస్తుంటే అది లాంగ్ మార్చా..షార్ట్ మర్చో అర్దంకావడంలేదు అన్నారు. లాంగ్ మార్చ్ పేరుతో 1934 లో చైనా కమ్యూనిస్ట్ ప్రజా విమోచన సైన్యం మావో నాయకత్వంలో పది వేల కిలోమీటర్లు నడిచి అధికారం సాధించింది. రెండున్నర కిలోమీటర్లు నడిచే పవన్ కళ్యాణ్ ఇసుక ఆందోళనను లాంగ్ మార్చ్ అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు.
లాంగ్ మార్చ్ పేరుతో 1934 లో చైనా కమ్యూనిస్ట్ ప్రజా విమోచన సైన్యం మావో నాయకత్వంలో పది వేల కిలోమీటర్లు నడిచి అధికారం సాధించింది. రెండున్నర కిలోమీటర్లు నడిచే @PawanKalyan ఇసుక ఆందోళనను లాంగ్ మార్చ్ అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 3, 2019