జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. కాని అది సినిమాల వరకే అని చెప్పాలి. రాజకీయ పరంగా చూసుకుంటే పవన్ ఏం చేస్తున్నాడో అతనికే తెలియడం లేదు అని కొందరు చెప్పుకొస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే 2014 ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు పవన్, బీజీపీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.అప్పుడే ఏవేవో మాటలు చెప్పి చంద్రబాబు ని ముఖ్యమంత్రిని చేసారు. తీరా ఆయన గెలిచిన తరువాత చేసింది ఏమైనా ఉందా అంటే అంతా సూన్యమే. దాంతో ఒక్కసారిగా పవన్ సైలెంట్ అయిపోయాడు. మొన్న జరిగిన ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసినప్పటికీ టీడీపీ, జనసేన కలిసే ఎన్నికల్లోకి దిగారు అనే వార్తలు వినిపించాయి. పరిస్థితులు చూస్తే అదే నిజం అని కూడా అర్ధమవుతుంది. అయితే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా పవన్ చంద్రబాబు హయంలో సైలెంట్ గా ఉన్న పవన్ ఇప్పుడు మాత్రం ప్రశ్నిస్తానని బయటకు వస్తున్నాడు. దీనంతటికీ అసలు కారణం ఎవరా అని ఆలోచిస్తే ఆయన వెంక బాబుగారి హస్తం ఉండనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. పవన్ కు డైరెక్షన్ ఇచ్చేది చంద్రబాబు నని ఆయన చెప్పినట్టే పవన్ చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా అన్నారు.