ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య నేడు సిడ్నీ వేదికగా మొదటి టీ20 మ్యాచ్ జరిగింది. కాని చివరికి వర్షం కారణంగా రద్దు అయింది. అయితే ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఆదిలోనే పాకిస్తాన్ కీలక వికెట్స్ ని పడగొట్టింది.ఆ తరువాత బాబర్ ఆజం తన పదునైన ఆటతో స్కోర్ ని ముందుకు తీసుకెళ్ళాడు. చివరికి 15 ఓవర్ల వద్ద వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. అప్పటికి పాక్ స్కోర్ 5వికెట్లు నష్టానికి 107 పరుగులు చేసింది. D/L ప్రకారం ఆస్ట్రేలియా టార్గెట్ 15ఓవర్లకి 119 కొట్టాలి. అయితే బ్యాట్టింగ్ కు వచ్చిన ఆస్ట్రేలియా ఓపెనర్స్ లో కెప్టెన్ ఫించ్ ఇర్ఫాన్ వేసిన ఒక ఓవర్ లో ఏకంగా 26 పరుగులు బాదాడు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోర్ 3.1 ఓవర్స్ కి 41రన్స్ సాధించారు. మల్లా వర్షం రావడంతో ఇక మ్యాచ్ మొత్తానికే ఆగిపోయింది.