మద్దెల పాలెం (తెలుగు తల్లి విగ్రహం) నుండి, GVMC గాంధీ విగ్రహం వరకు ఉన్న దూరం 2.5కీ.మీ. 20 నిముషాల నడకకు బాబుగారి పార్టనర్ పవన్ కళ్యాణ్ గారు దీనికి పెట్టిన పేరు లాం……..గ్ మార్చ్.అంటే లాంగ్ మార్చ్ @ 2.50కీ.మీ. ఇంతోటి దూరమున్న ఈ లాంగ్ మార్చ్ ఎక్కడ ఫెయిల్ అవుతుందోనని ఆదివారం నాడు ప్లాన్ చేశారు! సెలవు రోజు కాబట్టి పిల్లపిత్రేల హాజరుతో గట్టెక్కి,గ్రాండ్ సక్సెస్ అని పచ్చగొట్టాలు,కరపత్రాల్లో చాటుకోవడానికి ఇలా చేసారు.సొంత పుత్రుడితో 5 గంటల దీక్షని నిరాహారదీక్షగా ప్రకటించి, నిమ్మరసంతో విరమణ కార్యక్రమం పెట్టాడు.దత్తపుత్రుడితో 2.5 కిమీ దూరం నడకకి లాంగ్ మార్చ్ అని పేరుపెట్టి, హడావుడి చేయిస్తున్నాడు తెరవెనుకనున్న మన ‘దోమలపైదండయాత్ర’ వీరుడు !!!
