టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ మోదీ పంచన చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారా..అందుకే ఆరెస్సెస్ అధినేతతో భేటీ అయ్యారా..కమలం గూటికి చేరేందుకు ఆరెస్సెస్ ద్వారా రాయబారం నడుపుతున్నారా అంటే..ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. తాజాగా నాగపూర్‌లో చంద్రబాబు ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్‌తో భేటీ అయ్యారు. ఇది వ్యక్తిగత పర్యటన అని టీడీపీ నేతలు పైకి చెబుతున్నా..మళ్లీ బీజేపీతో సత్సంబంధాలు కోసమే బాబు భగవత్‌ను కలిసినట్లు సమాచారం. ఎన్నికలకు ముందు దేశమంతా తిరిగి మోదీని దింపేస్తా అంటూ ..చంద్రబాబు రంకెలు వేశాడు. నాకు పెళ్లాం పిల్లలు, మనవడు ఉన్నారు..మోదీలాగా పెళ్లాన్ని వదిలేయలేదు అంటూ వ్యక్తిగతంగా దూషించాడు. అయితే ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మోదీతో సున్నంపెట్టుకుని సంకనాకిపోయామని బాబుకు అర్థమైంది. అందుకే వెంటనే తనకు ఆర్థిక మూలాలైన నలుగురు రాజ్యసభ ఎంపీలను బీజేపీలో చేర్పించి వారి ద్వారా మోదీతో సఖ్యతకు రాయబారం నడిపాడు. ఏ ఎండకాగొడుగు పట్టే బాబుగారి నైజాన్ని పసిగట్టిన బీజేపీ పెద్దలు మళ్లీ బాబును దగ్గరకు రానిచ్చేది లేదని తమ పార్టీ నేతలతో తెగేసి చెప్పించారు. దీంతో దిక్కుతోచని చంద్రబాబు ఆరెస్సెస్ ద్వారా నరుక్కువద్దామని ప్లాన్ వేశాడు. వెంటనే నాగపూర్‌కు వెళ్లి ఆరెస్సెస్ చీఫ్ భగవత్‌ను కలిసి మళ్లీ మోదీతో దోస్తానా కల్పించు అని కాళ్లావేళ్లాపడ్డట్లు సమాచారం. అయితే మోహన్ భగవత్ మాత్రం..బాబుపై కస్సుబుస్సుమన్నట్లు సమాచారం. రాహుల్, సోనియాలతో కలిసి, దేశమంతా తిరిగి బీజేపీని నామరూపాల్లేకుండా చేస్తానని హుంకరించి..ఇప్పుడు కాళ్లావేళ్లా పడితే ఎలా అని బాబుకు మోహన్ భగవత్ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మోదీతో మళ్లీ దోస్తానా అంటే కష్టమే..అయినా నువ్వు అడిగావు కాబట్టి ఓ సారి చెప్పి చూస్తా..అని మాటవరుసకు ఆరెస్సెస్ చీఫ్ చెప్పినట్లు భోగట్టా. అయితే ఆరెస్సెస్ చీఫ్‌తో మీటింగ్ కోసం బాబు తెలుగు రాష్ట్రాల్లోని ఓ స్వామిజీ సహకారం తీసుకున్నట్లు సమాచారం. అసలు స్వామిజీలు అంటే గిట్టని చంద్రబాబు మూడు రోజుల క్రితం ఓ ప్రముఖ స్వామిజీ పుట్టిన రోజు వేడుకల్లో వంగి వంగి దండాలు పెట్టాడు. ఇప్పుడు ఆరెస్సెస్ చీఫ్‌తో భేటీ వెనుక సదరు స్వామిజీ మాట్లాడి పెట్టినట్లు సమాచారం. కాగా మళ్లీ బీజేపీతో సత్సబంధాల కోసం బాబు చేస్తున్న ప్రయత్నాలు చూసి అమ్మబాబు..మళ్లీ మోదీ పంచన చేరేందుకేనా ఈ తిప్పలు అంటూ నెట్‌జన్లు సెటైర్లు వేస్తున్నారు. మొత్తంగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్‌భగవత్‌తో బాబు భేటీ ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి మోదీకి దగ్గరవాలనుకున్న బాబు ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.