దేశ రాజధాని ఢిల్లీ లో ఏర్పడిన వాతావరణ ఇబ్బందులు రోజురోజికి పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఈ నేపధ్యంలో ఎందరో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రమాదకర ప్రాంతాల్లో ‘ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితి’ ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం మొత్తం ఎమర్జెన్సీ లో ఉంది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్కూల్ పిల్లల విషయంలో నవంబర్ 5 వరకు స్కూల్స్ కు సెలవులు ప్రకటించన విషయం తెలిసిందే. కాని తాజాగా ప్రభుత్వం వచ్చే శుక్రవారం వరకు స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. పరిస్థితి ఇంకా రెట్టింపు అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.