తాప్సి.. గ్లామరస్ పాత్రలతో సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు తాప్సి. ఎవరైనా తెలుగులో డీగ్లామ్ పాత్రల్లో నటించి బాలీవుడ్‌లో గ్లామరస్ పాత్రలు చేస్తారు.. కానీ తాప్సి దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. ‘ఝుమ్మంది నాదం’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, ‘వీర’ సినిమాల్లో గ్లామరస్‌గా కనిపించి బాలీవుడ్‌లో మాత్రం హోమ్లీ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఎంచుకునే సినిమాలు ఎంతో డిఫరెన్స్ గా ఉన్నాయి. విభిన్నమైన సినిమాలతో తన స్కిల్స్‌ను ప్రదర్శిస్తున్న తాప్సి ఆ విషయంలో మాత్రం స్ట్రిక్ట్ రూల్ పెట్టుకున్నారు. సినిమాలో రొమాన్స్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ సెక్స్ కంటెంట్ లా అనిపించే సినిమాలకు దూరంగా ఉంటానని అంటున్నారు. ‘ఓసారి నాకు ఐటెం సాంగ్‌లో ఆఫర్ వచ్చింది. కానీ నో చెప్పాను. ఎందుకంటే నేను హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాలో ఐటెంసాంగ్ చేస్తా కానీ వేరేవాళ్ల సినిమాలో చేయను. ఒకవేళ ఆ ఐటెం సాంగ్ ఇంపార్టెన్స్ ఉందనిపిస్తే చేయడానికి అభ్యంతరం లేదు.
కానీ ఏదో సినిమాలో మసాలా జోడించడానికి పెట్టే పాటల్లో నేను డ్యాన్స్ చేయను.. అంతేకాదు ఇప్పటివరకు నేను చూసిన సెక్స్ కంటెంట్ కామెడీ సినిమాల్లో సెక్స్ తప్ప కామెడీ లేదు. .అర్థంపర్థం లేకుండా అనవసరంగా అమ్మాయిలపై అసభ్యకర కామెంట్లు, డబుల్ మీనింగ్ డైలాగులతో తీసే సినిమాలు అసలు వేస్ట్. అదీకాకుండా ఇప్పటి వరకు నేను పర్‌ఫామెన్స్‌కు ప్రాధాన్యత ఉన్నపాత్రల్లో నటిస్తూ వచ్చా.. ప్రేక్షకులు కూడా దీనికే అలవాటుపడ్డారు. ఇప్పుడు ట్రాక్ మారిస్తే వారికినచ్చదు. ప్రేక్షకులు నన్ను గల నమ్మాలి. నేను సినిమా చేస్తున్నాంటే కచ్చితంగా అందులో ఏదో కంటెంట్ ఉందనే వారు నమ్మాలన్నారు. అయితే ఇపుడు ‘జుడ్వా 2’ సినిమా కోసం సన్నబడ్డాను. బికినీ వేసుకున్నాను.. చాలాకష్టంగా అనిపించింది. త్వరలో ఇలా బికినీ ధరించే పాత్రలో కన్పించబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని తెలిపారు తాప్సి.