సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆఖరి ఛాన్స్ ఇచ్చారు. నవంబరు 5 లోపు కార్మికులంతా డ్యూటీలో చేరవచ్చని ప్రకటించారు. వారందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు సీఎం. ప్రస్తుతం 50 శాతం ప్రైవేట్ బస్సులకు అనుమతిస్తున్నామని.. నవంబరు 5 లోపు కార్మికలు విధుల్లో చేరకుంటే వంద శాతం ప్రైవేట్‌కే అప్పగిస్తామని తెగేసి చెప్పారు. ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు కేసీఆర్. యూనియన్ల మాయలో పడి ఉద్యోగాలు పోగొట్టుకోవద్దని కార్మికుల కుటుంబాలకు సూచించారు. ఆర్టీసీ కార్మికులు కూడా తమ బిడ్డలేనన్న సీఎం.. వారి జీవితాలను నాశనం చేసే ఉద్దేశం తమకు లేదని చెప్పారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం కుదరని.. అలా చేస్తే ఎన్నో పరిణామాలకు దారితీస్తుందని స్పష్టం చేశారు.
