Home / TELANGANA / రియల్ ఎస్టేట్ ప్రతినిధులు నిబంధనలు పాటించాలి.. మంత్రి కేటీఆర్

రియల్ ఎస్టేట్ ప్రతినిధులు నిబంధనలు పాటించాలి.. మంత్రి కేటీఆర్

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కోనేందుకు GHMC ప్రణాళికలు సిద్దం చేసింది. గత కొన్ని నెలలుగా నగరంలో నిర్మించాల్సిన స్లిప్ రోడ్ల అంశం కొలిక్కి వచ్చింది. ఈమేరకు GHMC అర్బన్ టౌన్ ప్లానర్లు, ట్రాఫిక్ సిబ్బంది, నగర పోలీసులు, రియల్ ఎస్టేట్ ప్రతినిధుల నివేదికలు, ప్రజల సూచనల ప్రాతిపాదికల మేరకు ఒక ప్రణాళికను సిద్దం చేసింది. ఈ మేరకు నగర రోడ్లకు అనుసంధానంగా చేపట్టాల్సిన ఉపరోడ్ల (స్లిప్ రోడ్లు, అనుబంద రోడ్లు) మీద రియల్ ఎస్టేట్ ప్రతినిధులు, అధికారులతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటికే GHMC అధికారులు ఇప్పటికే పలు స్లిప్ రోడ్లను గుర్తించారని దీంతోపాటు నగర ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. ఈ మేరకు అధికారులకు సూమారు 300 సూచనలు వచ్చాయని, వాటిని పరిగణలోకి తీసుకున్నామని, ఈ సూచనల్లో అత్యధికం శాతం రోడ్లను తమ అధికారులు ఇప్పటికే గుర్తించారని తెలిపారు. ఇందుకోసం తమ అధికారులు ట్రాఫిక్ అధ్యయనం చేశారని, దీంతోపాటు క్షేత్రస్ధాయిలో పర్యటించి రూపొందించిన నివేదికల అధారంగా స్లిప్ రోడ్లను గుర్తించామన్నారు. ఈ రోజు జరిగిన సమావేశంలో గుర్తించిన స్లిప్ రోడ్లను మూడు రకాల ప్రాధాన్యతలుగా గుర్తించి, అత్యధిక ట్రాఫిక్ ఇబ్బందులున్న చోట్ల, అతి స్వల్పకాలంలోనే పూర్తి చేయగల రోడ్ల పనులు చేపట్టాలని మంత్రి అధికారులకు అదేశించారు. పలు రోడ్ల మద్య అనుసంధానంగా ఏర్పాటు చేయబోయే రోడ్ల వలన కనెక్టివిటీ పెరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం వెంటనే పనులు ప్రారంభించే రోడ్లు ఒక్క అధికారి భాద్యత తీసుకుని పనులు వేగంగా జరిగేలా చూడాలన్నారు. ఇందుకోసం జోనల్ కమీషనర్లు అయా అధికారులను నియమించాలన్నారు. దీంతోపాటు పలు జంక్షన్లలోనూ చిన్న చిన్న మార్పులతో ట్రాఫిక్ తగ్గే అవకాశాలున్న చోట్ల సైతం పనులు ప్రారంభించాలన్నారు. రియల్ ఎస్టేట్ ప్రతినిధులు పలు నూతన స్లిప్ రోడ్ల వివరాలను అందించారు. ఈ రోడ్ల వలన ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయని తెలిపారు. నగరంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ది పథాన సాగుతున్నదని, ఇందుకోసం ప్రభుత్వ సహాకారం కొనసాగుతున్నదని హమీ ఇచ్చారు. ఇదే సమయంలో అన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని రియల్ ఎస్టేట్ ప్రతినిధులను కోరారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat