కొన్ని సినిమాలు కథ, కథనాలు బాగున్నా ఎందుకనో ప్రేక్షకులను ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిలపడతాయి. మరి కొన్ని సినిమాలు కథ బాగున్నా..కథనం బాగోక ఫ్లాప్ అవుతాయి. అలాగే మరికొన్ని సినిమాలు ఫలానా సెంటిమెంట్‌పై ఫ్లాప్ అవుతాయని అంటారు. అయితే కథ, కథనాలు బాగున్నాయని..పక్కాగా హిట్ అవుతుందని నమ్మి, భారీగా ఖర్చుపెట్టి తీసిన సిన్మా ఫ్లాప్ అయితే ఆ నిర్మాత బాధ అంతా ఇంతా కాదు. మన టాలీవుడ్‌లో సిన్మా తీసేటప్పుడే ఫలానా సిన్మా హిట్ అవుతుంది..లేదా ఫ్లాప్ అవుతుందని చెప్పేవాళ్లలో మెగాస్టార్ చిరంజీవి ముందువరుసలో ఉంటారు. అలాగే తమిళంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా ఫలానా సిన్మా ఆడుతుందో లేదో ఇట్టే చెప్పేస్తారు. అలా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఓ సినిమా కచ్చితంగా ప్లాప్ అవుతుంది.. దయచేసి సినిమా నిర్మించకండి అని రజినీ కాంత్ ముందే ఆ సిన్మా నిర్మాతకి చెప్పేశారట. అయినా ఆ నిర్మాత రజనీ మాట లెక్క చేయక భారీగా ఖర్చుపెట్టి మరీ సిన్మా తీశారు. ఫలితం జూనియర్ కెరీర్‌లోనే అతిపెద్ద ఫ్లాప్‌గా ఆ చిత్రం నిలిచింది. ఇంతకీ ఆ చిత్రం ఏంటంటారా..ఆ మూవీ అశ్వనీదత్ నిర్మాతగా మెహర్ రమేష్ డైరెక్షన్‌లో రూపొందించిన శక్తి చిత్రం. భారీ ఎక్స్‌పెక్టేషన్‌తో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. నిర్మాత అశ్వనీదత్ ఆ చిత్రం తర్వాత ఆర్థికంగా ఇప్పటి వరకు పూర్తిగా కోలుకోలేదు. అంతలా నష్టపోయారు. అయితే తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్టీఆర్‌తో తీస్తున్న శక్తి సిన్మా పక్కాగా ఫ్లాప్ అవుతుందని అశ్వనీత్‌కు ముందే హెచ్చరించిన విషయం బయటకు వచ్చింది. కథానాయకుడు చిత్రం కోసం రజనీకాంత్‌ను కలవడానికి వెళ్లిన సందర్భంగా అశ్వనీదత్ జూనియర్ ఎన్టీఆర్‌తో తీస్తున్న శక్తి మూవీ కథ, కథనాల గురించి వివరించారంట. అప్పుడు రజనీ శక్తిపీఠాల మీద సిన్మా తీయకూడదు..ఆ సిన్మా ఆడదు..వెంటనే సిన్మా తీయడం ఆపేయండని అశ్వనీదత్‌కు సలహా ఇచ్చారంట..అయితే అప్పటికే కొంత భాగం షూటింగ్ అయిపోవడంతో సిన్మా ఆపేయడం ఇష్టంలేక అశ్వనీదత్ ముందుకు వెళ్లారంట..ఫలితం జీవితంలో కోలుకోలేని నష్టం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా అశ్వనీదత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రజనీకాంత్ గొప్ప ఆధ్యాత్మిక వాది, స్వయంగా హిమాలయాలకు వెళ్లి సిద్ధులతో కలిసి తపస్సు చేస్తుంటారు. ఆయనకు శక్తిపీఠాల మహత్యం తెలుసుకనుకే శక్తి సిన్మా తీయద్దని వారించారని సినీ జనాలు అంటున్నారు.మొత్తంగా ఎన్టీఆర్ మూవీ ఫ్లాప్ అవుతుందని రజనీకాంత్ ముందే చెప్పడం పట్ల ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.