వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. వైఎస్ జగన్ పై తెలుగుదేశం నాయకులు ఆరోపణలు చేయడం అవివేకమని, జగన్ చట్టాన్ని గౌరవిస్తున్నారని తెలిపారు.ఓటుకునోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి.. హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాడని, ఆ కేసుతో పాటు అనేక కేసుల్లో చంద్రబాబు స్టేలు తెచ్చుకోలేదా అని ప్రశ్నించారు.జగన్ నేరస్తుడు కాదు.. ఆయనపై ఉన్నవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, రాష్ట్రంలో ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిన పై ఉంది కాబట్టి మినహాయింపు ఇవ్వమని కోర్టుకు అప్పీల్ చేసుకున్నారని, వారు తీస్కరించారు.. అయితే CBI కోర్టు చెప్పేది ఫైనల్ నిర్ణయం కాదు, ఇంకా పైకోర్టులు ఉన్నాయి.. చంద్రబాబును ప్రజలు తిరస్కరించారు, కాబట్టి కొన్ని రోజులు ఎదురు చూడలని, ఖాళీగా లేని కుర్చీకోసం చంద్రబాబు ప్రాకులాడుతుదడం దారుణన్నారు.
మా ప్రభుత్వానికి 5 ఏళ్ళు అధికారంలో ఉండమని ప్రజలు అధికారం కట్టబెట్టారు. ఇంకా నాలుగున్నర సంవత్సరాల పాటు ఆ సీటు కాళీ కాదన్నారు. ఘోరంగా ఓడిపోయానన్న చింత చంద్రబాబుకు లేకపోగా.. ఆయన్ను ఓడించామని ప్రజలు బాధపడుతున్నారని అతనికతనే సొంత డబ్బా కొట్టుకోవడం విడ్డూరమన్నారు.అక్రమంగా డబ్బుతో పెయిడ్ ఆర్టిస్టులతో బురద జల్లే ప్రయత్నం చంద్రబాబు పదేపదే చేస్తున్నాడన్నారు. చంద్రబాబుకు కొన్ని చిల్లరపార్టీ లు మాత్రమే సపోర్టు చేస్తున్నాయి. ప్రజల మద్దతు లేదన్నారు. జగన్ కి, వైఎస్ఆర్సీపీ పార్టీకి పత్రికా స్వేచ్ఛ మీద, ప్రజాస్వామ్యం పైనా పూర్తి విశ్వాసం ఉందన్నారు.చంద్రబాబు తలపెట్టిన కార్యక్రమాలన్నీ పవన్ కళ్యాణ్ నెత్తిన వేసుకుంటాడని,ఒక పార్టీ అధ్యక్షుడు దేశ చరిత్రలో రెండు చోట్ల పోటీ చేస్తే.. రెండు చోట్లా ఓడిపోవడం మొదటిసారి అన్నారు.