ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటున్నదని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా గూడూరు ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి తన ఎంపీ ల్యాడ్స్ నుంచి ఆయన రూ. 4.5 లక్షలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరుగుదొడ్లు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టాయిలెట్ల కోసం విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు నిరీక్షించాల్సి వస్తోందని ఆయన అన్నారు. ఇలాంటి దురదృష్ట పరిస్థితులు మళ్లీ రాకూడదని.. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణ భాద్యతను తాను తీసుకుంటున్నట్లు ఆయన గతంలో హామీ ఇచ్చారు. తన హామీ ప్రకారం.. ఎంపీ నిధులు విడుదల చేసి తన మాట నిలబెట్టుకున్నారు. ఎంపీ విద్యార్థుల పట్ల తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధను గ్రామస్తులు అభినందిస్తున్నారు. ముఖ్యంగా ఆ పాఠశాల బాలికలు ఎంపీకి ధన్యవాదాలు తెలిపారు.