తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు ప్రాంతంలో సంచలనం సృష్టించిన మునగనూరు తల్లి హత్యకేసు నిందితురాలైన కీర్తిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈకేసును విచారిస్తున్న పోలీసులకు కీర్తి దిమ్మతిరిగే షాకింగ్ విషయాలను బయటపెడుతున్న సంగతి విదితమే.
అందులో భాగంగా తాజాగా కీర్తి రెడ్డి పోలీసు విచారణలో మాట్లాడుతూ” తన ప్రియుడు బాల్ రెడ్డినే పెళ్లి చేసుకుంటానని చెబుతున్నట్లు వార్తలు వస్తోన్నాయి. ప్రియుడు బాల్ రెడ్డి వలనే తనకు గర్భం రావడం వలన తననే వివాహాం చేసుకుంటానని ఆమె చెప్పింది అని సమాచారం.
ఒక మెడికల్ షాపులో ప్రెగ్నెసీ కిట్ తెచ్చుకుని పరీక్షలు చేయించుకోగా గర్భం నిర్ధారణ కావడంతో శశిని ఆశ్రయించానని ఆమె పేర్కొన్నది.