Home / ANDHRAPRADESH / మరోసారి బాబు చీకటి రాజకీయం..జాతీయ మీడియా ఛానళ్లతో అర్థరాత్రి సమావేశాలు..ఏం చెప్పాడంటే..!

మరోసారి బాబు చీకటి రాజకీయం..జాతీయ మీడియా ఛానళ్లతో అర్థరాత్రి సమావేశాలు..ఏం చెప్పాడంటే..!

చీకటి రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్…చంద్రబాబు..గతంలో ఢిల్లీలో అర్థరాత్రి చీకట్లో రహస్యంగా నాటి కేంద్ర మంత్రి చిదంబరాన్ని బాబు కలిసినట్లు ఇప్పటికీ చెప్పుకుంటారు. చంద్రబాబు చిదంబరాన్ని కలిసిన తర్వాతే..జగన్‌పై కేసుల పర్వం మొదలైందని జగమెరిగిన సత్యం. అయితే ఏపీలో ఘోర పరాజయం తర్వాత చంద్రబాబు మరోసారి తన చీకటి రాజకీయాలకు తెరతీసినట్లు సమాచారం. ఏపీలో జగన్ సర్కార్‌కు ప్రజల్లో ఆదరణ పెరిగిపోతుండడం, మరోపక్క టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ నేతలు వలసబాట పట్టడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిన చంద్రబాబు మరోసారి మీడియా మేనేజ్‌మెంట్‌కు సిద్ధమయ్యాడు. చంద్రబాబు నలభై ఏళ్ల కెరియర్‌లో మొత్తం మీడియా మేనేజ్‌మెంట్‌‌పైనే ఆధారపడి ఉందనడంలో సందేహం లేదు. మీడియాను మేనేజ్ చేయడంలో దేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా..అయితే ఎల్లోమీడియా ఛానళ్లతో జగన్ సర్కార్‌పై ముప్పేటా దాడులు చేస్తున్నా బాబుకు పెద్దగా ఫలితం దక్కడం లేదు. సోషల్ మీడియా కాలంలో ప్రజలు ఎల్లోమీడియాను పట్టించుకోవడం మానేశారు. ఇక్కడే చంద్రబాబు తన బుర్రకు పదను పెట్టి.. మరోసారి చీకటి రాజకీయాలకు తెరతీశాడు. జాతీయమీడియా మేనేజ్‌మెంట్‌కు సిద్దమయ్యాడు. దీపావళికి రెండు రోజుల ముందు హైదరాబాద్‌లోని తన ఇంట్లో అర్థరాత్రి పూట రహస్యంగా జాతీయ ఛానళ్ల మీడియా ప్రతినిధులతో బాబు సమావేశం అయ్యాడని సమాచారం. ఈ సందర్భంగా సదరు జాతీయ మీడియా బాసులకు, జర్నలిస్ట్‌లకు బాబు ఖరీదైన గిఫ్ట్‌లు ప్రెజెంట్ చేసినట్లు తెలుస్తోంది. అంతే కాదు పార్టీ తరుపున ఏది కావాలంటే అది అందిస్తామని భరోసా ఇచ్చినట్లు భోగట్టా. పలు అంశాలపై జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా టీడీపీ అనుకూలంగా ప్రసారాలు చేయాలని కోరాడంట..ఈ మేరకు జాతీయ మీడియా ఛానళ్లతో బాబు ఒప్పందం కుదర్చుకున్నాడని సమాచారం.అంతే కాదు జాతీయ ఛానల్స్ ప్రసారం చేసిన లింక్‌లను వెంటనే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్‌కు పంపమని రిక్వెస్ట్ చేశాడట. అలాగే తన పార్టనర్ పవన్ కల్యాణ్ విశాఖ ఇసుక ధర్నాకు హైదరాబాద్‌ నుండి జాతీయ మీడియా ఛానళ్ల ప్రతినిధులను తీసుకువచ్చి భారీగా కవరేజ్ వచ్చేలా చేయాలని మీడియాలోని ఓ కీలక వ్యక్తికి బాబు బాధ్యతలు అప్పగించాడంట. నిశితంగా పరిశీలిస్తే..ఈ చీకటి రాజకీయం గత రెండు మూడు నెలలుగా జరుగుతోందని జాతీయ మీడియా ఛానళ్ల ప్రసారాలు చూస్తే అర్థమవుతుంది. చంద్రబాబు పల్నాడు డ్రామాలో ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి జాతీయ మీడియా ఛానళ్లు పోటీలు పడి ప్రసారం చేశాయి. అలాగే రాజధాని విషయంలో జగన్‌‌ సర్కార్‌పై ఎల్లోమీడియా ఛానళ్లతో పోటీపడేలా జాతీయ మీడియా ఛానళ్లు వ్యతిరేకత కథనాలు ప్రసారం చేశాయి. ప్రస్తుతం ఏపీలో జగన్ సర్కార్‌కు వ్యతిరేక కథనాలు జాతీయమీడియాలో వస్తున్నాయంటే అది చంద్రబాబు మీడియా మేనేజ్‌మెంటే అని చెప్పక తప్పదు. ప్రస్తుతం చంద్రబాబు జాతీయ మీడియా ఛానళ్లతో చంద్రబాబు అర్థరాత్రి సమావేశాలు ఏపీ రాజకీయ, మీడియా వర్గాలో హాట్‌టాపిక్‌గా మారాయి. కాగా జాతీయ మీడియా ఛానళ్లకు భారీగా ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చిన చంద్రబాబు తమకు వారికంటే తక్కువ రేంజ్ కానుకలు ఇచ్చినట్లు ఎల్లోమీడియా ఛానళ్ల ప్రతినిధులు వాపోవడం ఈ చీకటి రాజకీయంలో కొసమెరుపు. మొత్తంగా జాతీయ మీడియా ఛానళ్లతో చంద్రబాబు చీకటి రాజకీయాలు రాజకీయ, మీడియా వర్గాల్లో సంచలనంగా మారాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat