కుర్రకారు డ్రీమ్‌గర్ల్, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్టార్ హీరోయిన్గా టాలీవుడ్, కోలీవుడ్‌లో టాప్ హీరోలందరితో నటించిన కాజల్ ఇక పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిందంట..ప్రస్తుతం కాజల్ వయసు 34..ఇక పెళ్లికి లేట్ చేయద్దని కాజల్ కుటుంబసభ్యులు ఆమెపై వత్తిడి తీసుకున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేసి పెళ్లి చేసుకునేందుకు కాజల్ రెడీ అవుతుందంట..ఇప్పటికే కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ ఒకట్రెండు తెలుగు సినిమాల్లో నటించి వెంటనే ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయింది. చెల్లెలి బాటలోనే కాజల్ అగర్వాల్ కూడా ఓ బిజినెస్‌మేన్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు సదరు వ్యాపారవేత్తతో కాజల్ పెళ్లి కుదిరినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇటీవల మంచు లక్ష్మీ ప్రోగ్రాంలో కూడా పెళ్లి చేసుకుని సెటిలయ్యే ఉద్దేశం ఉందని కాజల్ చెప్పడంతో ఆమె పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరుతున్నాయి. మొత్తంగా భారతీయుడు – 2 మూవీలో నటిస్తున్న కాజల్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక టాలీవుడ్ చందమామ పెళ్లివార్త ఆమె అభిమానుల గుండెలను బద్ధలు చేస్తోంది. మొత్తంగా కాజల్ పెళ్లివార్తలు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి.
