తెలుగు రీయాలీటి బిగ్‌బాస్ 3 షో రేపటితో ముగింపు పలకనుంది. మొదటగా మొత్తం పది హేను మంది కంటెస్టెంట్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీ, ఒక రీఎంట్రీ ఇలా ఎన్నో మలుపులు తిరుగుతూ వచ్చిన షో.. ముగిసేందుకు వచ్చింది. చివరకు రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజా టాప్ 5 కంటెస్టెంట్లుగా మిగిలారు. అయితే బిగ్‌బాస్ హౌస్‌లో గేమ్ ఆడకుండా.. నిజాయితీగా ఉన్న వ్యక్తిగా రాహుల్ సిప్లిగంజ్ పేరు తెచ్చుకున్నాడు. ఏది ఉన్నా మొహం మీదే చెప్పడం.. ముక్కుసూటిగా వ్యవహరించడంతో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే అతను వాడే భాష మీద కొంచెం నెగెటివిటీ వచ్చినా.. వాటిని అతని ఫాలోవర్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. మహేష్ మాట్లాడితే రాయలసీమ యాస అంటూ వెనకేసుకొచ్చిన నాగ్.. రాహుల్‌ను ఎలా తప్పుపడతారని ప్రశ్నించసాగారు
గత సీజన్‌లో కౌశల్ ఆడిన విధానానికి ఎంతో మంది ఫిదా అయ్యారు. కౌశల్ పేరిట ర్యాలీలు తీయడం అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. అయితే అందరూ అతడిని కార్నర్ చేయడం.. ఒంటరిని చేసి అందరూ ఆడటంతో అతనిపై సింపతి కూడా వర్కౌట్ అయింది. నామినేషన్స్ వచ్చేసరికి అందరూ కలిసి కౌశల్‌ను టార్గెట్ చేయడం అతనికి కలిసి వచ్చింది. అదే అతడ్ని విన్నర్ చేసింది. అందరి కంటే ఎక్కువ సార్లు (మొత్తం 11 సార్లు )నామినేషన్స్‌కు వెళ్లిన కౌశల్.. విజేతగా నిలిచాడు. అదే ఫార్మూలా రాహుల్ విషయంలోనూ జరిగింది. శ్రీముఖి పదే పదే రాహుల్‌ను టార్గెట్ చేయడంతో అతనిపై సింపతీ పెరిగింది. రాహుల్ నామినేషన్‌కు వెళ్లడం తిరిగి రావడంతో.. ఒకానొక సందర్భంలో శ్రీముఖి వెనక్కి తగ్గింది. రాహుల్ సైతం ఈ సీజన్‌లో 11సార్లు నామినేట్ అయ్యాడు. ఇదే విషయాన్ని పోల్చుతూ రాహుల్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.