మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 40ఏళ్ళు రాజకీయ అనుభవం లో అన్నీ దోచుకోవడమే తప్పా రాష్ట్రానికి గాని ప్రజలకు గాని చేసింది ఏమీ లేదనే చెప్పాలి. గత ఐదేళ్ళ పాలన విషయం చూసుకుంటే మరీ దారుణంగా ప్రవతిస్తున్నారని చెప్పాలి. తప్పుడు హామీలు ఇచ్చి, ప్రజలను నమ్మించి గొంతు కోశారు. ప్రజలను ఎన్నో ఆశలురేపి చివరికి గాలికి వదిలేసారు. అంతేకాకుండా యావత్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేసారు. ఇక ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి.”ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో సాక్షిగా అడ్డంగా దొరికాడు. 18 అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకుని సుమతి శతకాలు వల్లిస్తున్నాడు. 40 ఏళ్లుగా దోచుకుంటూనే ఉంటున్నాడు. ప్రజలు గుర్తించబట్టే అధికారం పీకేసి తరిమికొట్టారు. అయినా నిప్పు-తుప్పు అని రంకెలేస్తున్నాడు”అని మండిపడ్డారు.