జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒకపక్క జనసేన పార్టీని బలోపేతం చేయాలని భావిస్తుంటే మరొక పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని విడిపోతున్నారు. తాజాగ జనసేన పార్టీకి మరో సీనియర్ నేత,మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ అంటూ పవన్ కళ్యాణ్ హడావుడి చేస్తున్న తరుణంలో ఆయన పార్టీ నుంచి తప్పుకుంటున్నరని సమాచారం వచ్చింది. విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటి చేసిన బాలరాజు కొంతకాలంగా జనసేన పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ దోరణి పట్ల అంత సంతృప్తిగా లేరని అంటున్నారు. అయితే రాజకీయాలకు దూరంగా ఉండడమా?లేక ఏదైనా పార్టీలో చేరడమా అన్నది ఇంకా నిర్ణయించుకోలేదట. అంతేకాదు రాజీనామా అనంతరం ఆయన ఏ పార్టీలో చేరతారనే విషయంపై స్పష్టతరాలేదు.
