వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నిన్న సిద్దిపేట జిల్లాలో దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించాలి.ఈ క్రమంలో దుబ్బాకలో మహిళలకు మెప్మా రుణాలు,చెత్త బుట్టలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరవ్వాలి.
అయితే ఉదయం పదకొండు గంటలకు రావాల్సిన మంత్రి హారీష్ రావు నాలుగు గంటలు ఆలస్యంగా అక్కడికి వచ్చారు. వచ్చి రాగానే మంత్రి హారీష్ రావు మహిళలకు క్షమాపణలు చెప్పారు. అక్కడితో ఆగకుండా ఆలస్యంగా వచ్చిన మంత్రి హారీష్ రావు దీనికి పరిహారంగా మహిళలను జరిమానా విధించాలని కోరారు.
దీంతో మహిళలు తమకు మహిళా భవనం కావాలని మంత్రిని కోరారు. అంతే ఇక మహిళా భవనానికి రూ. యాబై లక్షలను మంజూరు చేయిస్తానని హామీచ్చారు మంత్రి హారీష్ రావు. దీనిపై నెటిజన్లు మంత్రి హారీష్ రావు ఏమి చేసిన కానీ అది సరికొత్త ట్రెండ్ గా మారుతుందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.