తాజాగా తెలుగుదేశం పార్టీ గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మోహన్ రాజీనామా చేసిన నేపథ్యంలో అక్కడ మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నికలు జరుగుతాయి. అయితే ఇక్కడ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేస్తారు అనే అంశంపై సందిగ్దత నెలకొంది. ఈ క్రమంలో పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలో పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు మరోసారి బరిలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ప్రత్యామ్నాయంగా వంశీకి రాజ్యసభ సీటు ఇవ్వనున్నారు. ఇదే జరిగితే తర్వాత గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు లేడు కాబట్టి గెలుపు నల్లేరుపై నడక గా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు పార్టీ అధ్యక్షుడు నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.