చూసి చూడంగానే నచ్చేసావే అంటూ ఓ పాట తో వచ్చిన రష్మిక మందన అతి తక్కువ రోజుల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దీనికి కచ్చితంగా విజయ్ దేవరకొండ తో చేసిన సినిమాలే కారణం అని చెప్పుకోవచ్చు. గతంలో వచ్చిన గీతాగోవిందం ఆ తరువాత వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాలతో తన అవుట్ అండ్ అవుట్ పర్ఫార్మెన్స్ తో రష్మిక అగ్ర హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో మహేష్ బాబు సరసన నటిస్తున్న ఈ భామ అల్లు అర్జున్ తో ఓ సినిమాలో నటిస్తోంది. అలాగే భీష్మ సినిమాలో అలాగే రవితేజతో మరో సినిమాలో నటిస్తోంది. మొత్తం మీద విజయ్ హీరోయిన్ భారీ ఆఫర్లతో దూసుకెళుతోంది. అయితే హీరోయిన్ వచ్చిన కొత్తల్లో వరుస ఆఫర్లతో బిజీ అవడం తర్వాత ఖాళీ అవ్వడం మనం తరచుగా చూసాం. దశాబ్దాలపాటు నిలబెట్టుకున్న నిలబడిన అతి తక్కువ మందిని చూసాం. మరి రష్మిక ఇలా వరుసగా సినిమాలు చేసుకుని కనుమరుగై పోతుందా లేదా దశాబ్దాలపాటు తెలుగు చలన చిత్ర ఇండస్ట్రీలోనూ తెలుగు ప్రేక్షకులను కూడా ఉంటుందా అనేది వేచి చూడాలి.
