టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఎప్పుడూ వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్ గా నిలిచే వర్మ చంద్రబాబునే టార్గెట్ చేస్తునాడని అందరికి తెలిసిందే. ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాతో బరిలోకి వచ్చిన వర్మ మొన్ననే ఈ చిత్ర ట్రైలర్ కూడా రిలీజ్ చేసాడు. అయితే ఈరోజు ట్విట్టర్ వేదికగా మరో బాంబు పేల్చాడు. ఈ చిత్రానికి సంబంధించి నవంబర్ 2 ఉదయం 9:36 కు పాట రిలీజ్ చేయబోతున్నాడు. ఆ పాట మరేవ్వరిదో కాదుస్వయానా కేఏ పాల్ ది. మరి ఈ పాట ఎలా ఉండబోతుంది, పాట విడుదల అయితే ఎలాంటి వివాదం రానుంది అనేది రేపటివరకు ఎదురుచూడాల్సిందే.