టీటీడీ స్థానిక సలహామండలి వైస్‌ప్రెసిడెంట్‌గా వైస్ ప్రెసిడెంట్‌గా కరణ్ కాన్సెప్ట్స్, దరువు మీడియా అధినేత సీహెచ్ కరణ్ రెడ్డి నియమితులయ్యారు.. తాజాగా టీటీడీ బోర్డ్ హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్, ముంబై నగరాలకు సంబంధించి టీటీడీ స్థానిక సలహామండలి(Lac)లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ ప్రాంత టీటీడీ ఆలయాలు, సమాచార కేంద్రాల సలహా సంఘానికి కరణ్ రెడ్డి ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. హిందూ ధార్మిక పరిరక్షణకు చేస్తున్న కృషికిగాను కరణ్ రెడ్డికి ఈ బాధ్యతలను టీటీడీ అప్పగించింది. టీటీడీ బోర్డ్ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు టీటీడీ పాలనా విభాగం జేఈవో బసంత్‌కుమార్ హైదరాబాద్ స్థానిక సలహామండలిని ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేశారు. హైదరాబాద్ ప్రాంత టీటీడీ సలహామండలిలో వైస్ ప్రెసిడెంట్ కరణ్ రెడ్డితో సహా మొత్తం 20 మంది సభ్యులు ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీ, బెజ్జంకి అనిల్‌కుమార్, కొండా రాఘవరెడ్డి, దుర్గా సుఖేందర్ రెడ్డి, వడ్డేపల్లి రాజేశ్వరరావు, సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితరులకు మెంబర్లుగా అవకాశం దక్కింది.
ఆధ్యాత్మిక చింతన, భక్తిభావం మెండుగా కలిగిన కరణ్ రెడ్డి తన దరువు మీడియా ద్వారా తెలుగు రాష్ట్రాలలో ధార్మిక ప్రచారం గావిస్తున్నారు. అటు ఏపీలో సీఎం జగన్‌కు, ఇటు తెలంగాణలో సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు కరణ్ రెడ్డి అత్యంత సన్నిహితులు. గత ఐదేళ్లుగా తన కరణ్ కాన్సెప్ట్స్ యాడ్ ఏజెన్సీ, దరువు మీడియా ద్వారా ఇరు రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికలలో ఎన్నికల క్యాంపెయిన్, సోషల్ మీడియా ప్రచారంలో కరణ్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతిమహాస్వామికి వారికి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి కరణ్ రెడ్డి ప్రియశిష్యులు. శ్రీ స్వాత్మానందేంద్ర హిందూ ధర్మ ప్రచారయాత్రకు రెండు తెలుగు రాష్ట్రాల సమన్వయకర్తగా కరణ్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. గత నెలరోజులుగా శ్రీ స్వాత్మానందేంద్రతో కలిసి కరణ్ రెడ్డి తెలంగాణలో హిందూ ధర్మ ప్రచారయాత్ర నిర్వహిస్తున్నారు. కరణ్ రెడ్డిలోని కార్యదక్షత, ఆధ్యాత్మిక సేవా గుణాన్ని గుర్తించిన టీటీడీ ఆయనకు తెలంగాణ ప్రాంత స్థానిక సలహామండలి వైయస్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టింది.
మొత్తంగా టీటీడీ తెలంగాణ అడ్వైజరీ కమిటీ (LAC) వైయస్ ప్రెసిడెంట్‌గా దరువు ఎండీ కరణ్ రెడ్డి ఎంపిక కావడంతో ఇరు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా కరణ్ రెడ్డి మాట్లాడుతూ..ఏడుకొండలవాడికి సేవ చేసే భాగ్యం కల్పించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, తెలంగాణ మంత్రివర్యులు కేటీఆర్‌కు, టీటీడీ బోర్డ్ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డిలకు, విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారికి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారికి ధన్యవాదాలు తెలియజేశారు. టీటీడీ బోర్డ్ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి సారథ్యంలో తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని, తెలంగాణ రాష్ట్రంలో టీటీడీ దేవాలయాలు, కల్యాణమండపాల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని కరణ్ రెడ్డి తెలిపారు. కేవలం 38 ఏళ్లకే శతాబ్దాల చరిత్రగల తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణ అడ్వైజరీ కమిటీ వైస్ ప్రెసిడెంట్‌గా కరణ్ రెడ్డి నియమింపబడడం అభినందనీయం.