తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన తొత్తల మహేందర్ యాదవ్ సతీమణి గాయత్రికి గత ఆగస్ట్ నెలలో పురిటి నొప్పులు రావడంతో జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు.
గాయత్రిని పరిశీలించిన వైద్యులు గర్భ సంచి మాగిలో ఇద్దరు కవలలు ఉన్నారు. ఆపరేషన్ చేయడం సాధ్యం కాదు. శిశువులతో పాటు తల్లికి కూడా ప్రాణాపాయం ఉంటుంది అని తేల్చి చెప్పారు. అయితే కరీంనగర్లోని వైద్యులు సైతం చేతులేత్తేస్తే హైదరాబాద్ కి తీసుకెళ్లమని సూచించారు. దీంతో ఆర్థిక స్థోమత లేని మహేందర్ తంగళ్ళపల్లి ఎంపీపీ పడిగెల మానస ,రాజు దంపతులను ఆశ్రయించారు.
ఈ విషయాన్ని వీరిద్దరూ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్లోని రెయిన్ బో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఆ తర్వాత మంత్రే స్వయంగా ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందింజాలని కోరారు. శస్త్రచికిత్సకు అవసరమైన రూ. 5 లక్షల ఎల్వోసీను మంజూరు చేయించి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు మంత్రి కేటీ రామారావు. శస్త్రచికిత్స అనంతరం గాయత్రి ఇద్దరు కవలలుకు జన్మనిచ్చింది.