తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ ను అందరూ పప్పు అంటారనే విషయం తనకు తెలియదని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. కమ్మ రాజ్యం లో కడప రెడ్లు అనే సినిమాను వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రైలర్లు, పాటలు, పోస్టర్లతో సినిమా ప్రమోషన్ చేస్తున్నారు రాంగోపాల్ వర్మ. అయితే ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో లోకేష్ ను కించపరిచే విధంగా సీను చిత్రీకరించాలని తండ్రి చంద్రబాబు నాయుడు లోకేష్ కు పప్పు వడ్డిస్తున్న సీన్ ఎంతవరకు కరెక్టు అని పలువురు జర్నలిస్టులు రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రశ్నించారు. అయితే దీనికి చాలా తెలివిగా సమాధానం చెప్పారు వర్మ.. ఒక తండ్రి కొడుకుకు భోజనం సమయంలో కర్రీ వేసే అంశాన్ని నేను తీశానని లోకేష్ ను పప్పు అంటారన్నది తనకు తెలియదని చెప్పుకొచ్చారు. ఏదేమైనా వర్మ క్రియేట్ చేసిన సెన్సేషన్ సినిమా విడుదలయ్యే నాటికి ఏ స్థాయికి చేరుతుందో చూడాలి.
