నటి రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తరవాత ఇద్దరు పిల్లలతో జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. కేవలం వ్యక్తిగత జీవితాన్నే కాకుండా ప్రొఫెషనల్ లైఫ్‌ను ఆమె ఎంజాయ్ చేస్తున్నారు. తనకెంతో ఇష్టమైన సినీ పరిశ్రమలోనే ఆమె కొనసాగుతున్నారు. హైదరాబాద్ నుంచి పుణే వెళ్లిపోయిన రేణు.. మరాఠి చలనచిత్ర రిశ్రమలోకి అడుగుపెట్టారు. దర్శకురాలిగా ఒక సినిమా, నిర్మాత గా రెండు సినిమాలు చేశారు. ఇప్పుడు తెలుగులో సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నారు.
ఒకవైపు బిజీగా ఉంటూనే పిల్లలతోనూ వ్యక్తిగత జీవితాన్ని గుడుపుతున్నారు. అప్పుడప్పుడు పిల్లలతోకలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు. ప్రస్తుతం రేణు ఒంటరిగా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. మాల్దీవుల్లో ఉన్నారామె. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. రెండు ఫొటోలను కూడా షేర్ చేశారు. సముద్రంలో ఒంటరిగా జలకాలాట ఆడటం ఎంతో బాగుందని,
‘‘పర్వతాలు నా హృదయమైతే, మహాసముద్రం నాఆత్మ అని నాకు తెలిసింది. ఈ మాల్దీవుల విహార యాత్రలో సముద్రంలో నేను ఒంటరిగా గంటలపాటు ఈత కొట్టిన తరవాత ఈవిషయం నాకు అర్థమైంది. చేపఆత్మ నాలో ఉందని తెలుసుకున్నాను. అగ్ని నాకు ఇష్టమైన భూతం అంటే వెటకారంగా అనిపించేది. కానీ అగ్ని అనే కాన్సెప్ట్‌కు నేను బాగా ఆకర్షితురాలినయ్యాను. కానీ, నీటిలో ఉంటే ఇంట్లో ఉన్న భావన కలుగుతోంది. జీవితం అంటే ఇదే అని ఇప్పుడు నాకు తెలిసింది. అని వేదాంతం చెప్పుకొచ్చారు రేణు.. మొత్తం మీద అ రేణు దేశాయ్ మొదటి సారి ఇలా ఒంటరిగా వెకేషన్ కి వెళ్లి ఇటువంటి వేదాంతపు వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.