గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు ప్రజలనే కాకుండా యావత్ రాష్ట్రాన్నే కష్టాల్లో పెట్టేసాడు. చంద్రబాబు పదవీకాలం పూర్తయ్యే సరికి రాష్ట్రానికి అప్పులు మాత్రమే మిగిల్చాడు.ఏవేవో చేస్తానని తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి గెలిచాక రాష్ట్రం అప్పుల్లో ఉంది నేనేమి చెయ్యలేను అని చేతులెత్తేసాడు. దాంతో ప్రజలు ఆయనపై నమ్మకం కోల్పోయారు. జగన్ అయినా వారి తలరాతలు మారుస్తారేమో అని ఆయనను అఖండ మెజారిటీతో గెలిపించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినా క్షణం నుండి ఇప్పటివరకు ప్రజలకోసం తనని నమ్మి గెలిపించినందుకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే నిరుద్యోగులకు, రైతులకు, ఆటో వాళ్ళకి, వృద్దులు ఇలా అందరికి న్యాయం చేసారు. అంతేకాకుండా పోలీసులకు వీక్లీ హాఫ్ ఇవ్వడంతో వారు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగన్ పెడుతున్న పథకాలు చూసి దేశంలోని ప్రతీ రాష్ట్రం జగన్ నే ఆదర్శంగా తీసుకుంటున్నారు. దేశ ప్రధాని మోదీ పోలీసులు విషయంలో ఫిదా అయ్యారు.జగన్ ఆశయం కూడా అదే అని చెప్పాలి. రాష్ట్రం దేశానికే ఆదర్శం కావాలన్నదే ఆయన ధ్యేయం..!