ఒకరేమో తన అందంతో పాటు చక్కని అభినయం.. సూపర్ డాన్స్ లతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన బక్కపలచు భామ సాయి పల్లవి. మరోకరేమో వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మాస్ లవ్ రోమాన్స్ సినిమాలతో తనకంటూ ఒక స్టార్ డమ్ తెచ్చుకున్న యువహీరో అక్కినేని నాగచైతన్య.
మరి వీరిద్దరి కలయికలో చిత్రమంటే తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటుగా ఇటు సాయి పల్లవి అభిమానులకు.. అటు అక్కినేని అభిమానులకు పండుగే. మరి ఇలాంటి అరుదైన కాంబినేషన్లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల.
ఇప్పటి వరకు తాను తీసిన అచ్చమైన తెలుగు కథల చిత్రాలకు ఆంగ్లంలోనే పేర్లు పెట్టడం అనవాయితీగా వస్తున్నాడు కమ్ముల. తాజాగా సాయి పల్లవి,నాగ చైతన్య ల చిత్రానికి లవ్ స్టోరీ అనే టైటిల్ పేరుగా ఖరారు చేశారు.
ఇందులో సాయిపల్లవి నృత్యకారిణిగా .. చైతూ తెలంగాణ ప్రాంత యువకుడిగా కన్పించబోతున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.