కేంద్ర రైల్వే మరియు వాణిజ్య శాఖ మంత్రి అయిన పియూష్ గోయల్ ను తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఢిల్లీ పర్యటనలో భాగంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో రైల్వే విభాగానికి రావాల్సిన నిధులు.. నెరవేర్చాల్సిన పలు హామీల గురించి కేంద్ర మంత్రి పియూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇందులో భాగంగా మంత్రి కేటీ రామారావు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఫార్మాసిటీకి సహాకరించాలని కేంద్ర మంత్రిని కోరారు. రాజధాని నగరంలో తొలి జాతీయ డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. విజయవాడ నుండి నల్లగొండ మీదుగా రాజధాని నగరానికి రోజు వారీ రైలును నడిపించే ఏర్పాట్లను చేయాలని ఆయన విన్నవించారు.