తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి,బీజేపీ జాతీయ అధ్యక్షుడైన అమిత్ షాతో భేటీ అయ్యారు.
ఈ భేటీ సందర్భంగా ఇరువురి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. అందులో భాగంగా మంత్రి కేటీ రామారావు కేంద్ర మంత్రి అమిత్ షాను” రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని బేగంపేట సమీపంలో రసూల్ పుర దగ్గర ప్లై ఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న భూములను కేటాయించాలని”ఆయన కోరారు.
అంతేకాకుండా రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఫార్మా సిటీకి కేంద్రం నుంచి నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి అమిత్ షాను కోరారు. ఇంకా ఖమ్మం జిల్లాలో గ్రానైట్ రవాణా కోసం రైల్వే సైడింగ్ వసతులను కూడా సమకూర్చాలని కూడా కేంద్ర మంత్రి అమిత్ షాను కోరారు మంత్రి కేటీ రామారావు..