మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా.. అందాల రాక్షసి సమంత హీరోయిన్ గా .. సీనియర్ హీరో జగపతి బాబు, ఆది పినిశెట్టి,యాంకర్ అనసూయ ప్రధాన పాత్రల్లో సుకుమార్ దర్శకత్వంలో విడుదలై దాదాపు రూ.200 కోట్ల వరకు కలెక్షన్లను కొల్లగొట్టిన చిత్రం రంగస్థలం.
ఈ మూవీ రామ్ చరణ్ కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలిచింది.విమర్శకుల ప్రశంసలతో పాటు చెర్రీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను అందించారు.
ఈ చిత్రాన్ని తమిళ రీమేక్ రైట్స్ ను ప్రముఖ నృత్య దర్శకుడు,దర్శకుడు నటుడైన రాఘవ లారెన్స్ దక్కించుకున్నాడు. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తుండగా ఈ మూవీలో రామ్ చరణ్ తేజ్ పాత్రలో రాఘవ లారెన్స్ నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారక ప్రకటన రానున్నది అని సమాచారం.