ఏపీలో కొలువుల జాతర మొదలు కానున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మరోసారి పోలీసు కొలువుల భర్తీకి వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. అందులో భాగంగా మొత్తం 11,356 కానిస్టేబుల్,340 ఎస్ ఐ పోస్టుల భర్తీకి అనుమతులు ఇవ్వాలని పోలీసు నియామక మండలి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రతిపాదనలు పంపింది.
ప్రస్తుతం ఉన్న పోలీసులకు వారాంతపు సెలవులు అమలుల్లో ఉండటంతో సిబ్బంది కొరత ఉంది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి త్వరగా అనుమతులు ఇవ్వాలని పోలీసు నియామక మండలి ప్రభుత్వాన్ని కోరింది.